Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 20 2021 @ 18:13PM

సిద్ధూ పాకిస్తాన్ ప్రేమికుడు: అమిత్ మాల్వియా

న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ అభిమాని అంటూ భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ విభాగం అధినేత అమిత్ మాల్వియా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునేందుకు డేరా బాబా నాయక్ (గుర్‌దాస్‌పూర్) వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుకు సిద్ధూ శనివారం చేరుకున్నారు. కాగా, సిద్ధూకి కార్తార్‌పూర్‌లో ఘన స్వాగతం లభించింది. పాకిస్తాన్‌లో ఉన్న సిక్కులతో పాటు ఇతర స్థానికులు సిద్ధూపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు.


పాక్‌తో వర్తకం కోసం మన సరిహద్దులు తెరవాలి: సిద్ధూకాగా, సిద్ధూ కర్తార్‌పూర్ పర్యటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తీవ్ర అభ్యంతరం తెలిపారు. సిద్ధూని పాక్ అభిమాని అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. సిద్ధూకి కర్తార్‌పూర్‌లో పూలతో స్వాగతం పలుకుతున్న వీడియోను శనివారం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన అమిత్ మాల్వియా.. ‘‘రాహుల్ గాంధీకి ప్రీతిపాత్రుడైన నవజ్యోత్ సింగ్‌ సిద్ధూ.. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ని ‘పెద్ద అన్న’ అని అభివర్ణించారు. అంతేకాదు. గతంలో ఒకసారి పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధినేతను కౌగిళించుకుని, అతడిపై ప్రశంసలు కురిపించాడు. గాంధీ తోబుట్టువులు (రాహుల్-ప్రియాంక) అనుభవజ్ణుడైన అమరీందర్‌కు బదులు పాకిస్తాన్ ప్రేమికుడు సిద్ధూని ఎంచుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?’’ అని రాసుకొచ్చారు.

Advertisement
Advertisement