సర్జికల్ స్ట్రేక్స్‌తో గట్టిగా బుద్ధి చెప్పిన మోదీ ప్రభుత్వం : అమిత్ షా

ABN , First Publish Date - 2021-12-05T19:10:27+05:30 IST

భారత దేశ సరిహద్దుల్లో జరిగే దాడులకు భారత దేశం దీటుగా

సర్జికల్ స్ట్రేక్స్‌తో గట్టిగా బుద్ధి చెప్పిన మోదీ ప్రభుత్వం : అమిత్ షా

జైసల్మేర్ (రాజస్థాన్) : భారత దేశ సరిహద్దుల్లో జరిగే దాడులకు భారత దేశం దీటుగా బదులిచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటువంటి దాడులపై సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దీటుగా స్పందించిందన్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) 57వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.   


భారతదేశం యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందని చెప్పారు. దీనిని త్వరలోనే భద్రతా దళాలకు అందజేస్తామన్నారు. 2019లో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం, అధికరణ 370ని రద్దు చేయడం జరిగిన తర్వాత పాకిస్థాన్‌తోగల భారత దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్లు, గుర్తు తెలియని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయన్నారు. 


బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాలు జైసల్మేర్‌లో జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి అమిత్ షా పతకాలను అందజేశారు. శనివారం ఆయన భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని రొహిటాష్‌లో పర్యటించారు. బీఎస్ఎఫ్ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. 


Updated Date - 2021-12-05T19:10:27+05:30 IST