Abn logo
Oct 21 2021 @ 21:32PM

2019 తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు.  ఇక్కడ పౌరులపై లక్షిత దాడులు జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ సభ్యులు, రాజకీయ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే, కేంద్ర బలగాలతో సమావేశమై భద్రతపై సమీక్షిస్తారు.


ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత షా తొలిసారి ఇక్కడ పర్యటించనున్నారు. ఈ నెలలో ఇక్కడ జరిగిన దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. పర్యటనలో భాగంగా షా తొలుత శ్రీనగర్ చేరుకుంటారని, ఆ తర్వాత జమ్ము వెళ్తారని జమ్మూకశ్మీర్ బీజేపీ నేత సునీల్ శర్మ తెలిపారు. అలాగే, తిరిగి ఢిల్లీ వెళ్లడానికి ముందు కశ్మీర్‌ను సందర్శిస్తారని పేర్కొన్నారు.   

ఇవి కూడా చదవండిImage Caption