ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మన దేశంలో తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఇండియా పోలియో రహిత దేశంగా మారినప్పుడు మనమంతా గర్వపడ్డాం. అదే తరహాలో కోవిడ్ 19 నుండి రహిత దేశమని గర్వంగా చెప్పుకునే క్షణం వస్తుంది" అని ట్వీట్ చేశారు అమితాబ్ బచ్చన్. మరి ఆ క్షణం తర్వగా రావాలని కోరుకుందాం. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆయన శ్రీమతి జయా బచ్చన్ మినహా అందరూ కోవిడ్ ప్రభావానికి గురైన వారే.