ఓటీటీలోకి అమితాబ్‌ షూబైట్‌

ABN , First Publish Date - 2021-01-10T06:09:19+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో ఓటీటీల్లో కొత్త చిత్రాల విడుదల పెరిగింది. కొన్ని చిత్రాలను ఓటీటీ వేదికలు కోట్లు కుమ్మరించి కొన్నాయి.

ఓటీటీలోకి అమితాబ్‌ షూబైట్‌

కరోనా లాక్‌డౌన్‌తో ఓటీటీల్లో కొత్త చిత్రాల విడుదల పెరిగింది. కొన్ని చిత్రాలను ఓటీటీ వేదికలు కోట్లు కుమ్మరించి కొన్నాయి. గతేడాది ఓటీటీలో విడుదలైన అమితాబ్‌ బచ్చన్‌ చిత్రం ‘గులాబో సితాబో’ మంచి రేటు పలికింది. దీంతో గతంలో షూటింగ్‌ పూర్తయి విడుదల నిలిచిపోయిన అమితాబ్‌ చిత్రం ‘షూబైట్‌’ను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో అమితాబ్‌ 60 ఏళ్ల వయస్కుడి పాత్రను పోషించారు. చిత్ర నిర్మాతల మధ్యన విభేదాలు రావడంతో విడుదల నిలిచిపోయింది. ‘గులాబో సితాబో’ చిత్రాన్ని ఓటీటీలో మంచి ధర, ఆదరణ దక్కడం చూసి నిర్మాతలు రాజీపడి, తమ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.


Updated Date - 2021-01-10T06:09:19+05:30 IST