ఈ చిన్నారులతో.. మహిళల క్రికెట్‌ జట్టు!

ABN , First Publish Date - 2021-01-16T06:45:35+05:30 IST

విరాట్‌ కోహ్లీకి కూతురు పుట్టడంతో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ఫన్నీ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మధ్యకాలంలో క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ...

ఈ చిన్నారులతో.. మహిళల క్రికెట్‌ జట్టు!

ముంబై: విరాట్‌ కోహ్లీకి కూతురు పుట్టడంతో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ఫన్నీ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మధ్యకాలంలో క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ.. ధోనీ, రైనా, గంభీర్‌, రోహిత్‌, షమి, రహానె, జడేజా, పుజార, సాహా, హర్భజన్‌, నటరాజన్‌, ఉమేష్‌ పేర్లను బిగ్‌బీ తన ట్వీట్‌లో ప్రస్తావించాడు. మన క్రికెటర్లంతా కలిసి భవిష్యత్‌ మహిళల క్రికెట్‌ జట్టును తయారు చేస్తున్నారనీ.. వీళ్లకు ధోనీ కూతురు కెప్టెన్‌గా ఉంటుందేమో అని బిగ్‌బీ ట్వీట్‌ చేశాడు.  

Updated Date - 2021-01-16T06:45:35+05:30 IST