Abn logo
Apr 10 2020 @ 05:11AM

అమితాబ్‌ ముందడుగు

లాక్‌ డౌన్‌ కారణంగా ఆర్ధికంగా  ఇబ్బంది పడుతున్న పేద ప్రజానీకాన్ని ఆదుకోవడానికి అమితాబ్‌ బచ్చన్‌ ముందడుగు వేశారు. గురువారం ఆయన ఉత్తర ముంబై  స్లమ్‌ ఏరియాల్లో   ఉంటున్న పేదలకు రెండు వేల ఆహార పొట్లాలు పంచారు. అలాగే మూడు వేల మందికి నెలకు సరిపడే నిత్యావసర వస్తువుల్ని అందజేశారు. ఈ విషయాన్ని తన బ్లాగ్‌ ద్వారా అమితాబ్‌ వెల్లడించారు. అఖిల భారత సినీ కార్మిక సమాఖ్యకు చెందిన లక్షమంది సభ్యులను ఆదుకొంటానని ఆయన ఇటీవల ప్రకటించారు. దీనికోసం కార్యాచరణను ఆయన రూపొందించారు. ‘ సమాఖ్య సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. అతి కొద్ది రోజుల్లోనే ఆ పని పూర్తవుతుంది.  ఇంట్లో నలుగురు సభ్యులకు చొప్పున నాలుగు లక్షల మందికి నెలకు సరిపడే నిత్యావసర వస్తువుల్ని అందించాలని నా ప్రయత్నం’ అని అమితాబ్‌ పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement