Abn logo
Oct 28 2020 @ 09:39AM

భార్యపై జోక్ చేసిన కంటెస్టెంట్.. అమితాబ్ సీరియస్!

Kaakateeya

ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం `కౌన్ బనేగా కరోడ్‌పతి` కార్యక్రమంతో బిజీ అయ్యారు. ప్రస్తుతం 12వ సీజన్ ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ తన భార్య గురించి చేసిన కామెంట్‌పై అమితాబ్‌ కాస్త సీరియస్ అయ్యారు. 


`ఈ కార్యక్రమంలో గెలిచిన ప్రైజ్ మనీతో ఏం చేస్తార`ని కంటెస్టెంట్‌ను అమితాబ్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కంటెస్టెంట్.. `15 సంవత్సరాలుగా నా భార్య మొహాన్ని చూసి విసుగొచ్చింది. ప్రైజ్‌మనీతో ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాన`ని చెప్పాడు. దీనికి స్పందించిన బిగ్ బీ.. `సరదాకి కూడా ఇలాంటి మాటలు అనకండ`ని అన్నారు. అలాగే ఇతని మాటలను సీరియస్‌గా తీసుకోకండని సదరు కంటెస్టెంట్ భార్యకు సూచించారు.  

Advertisement
Advertisement