‘అలెక్సా’కు అమితాబ్‌ గొంతు

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

సుప్రసిద్ధ హిందీ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ఈయన బంధువు కాదు. అమెజాన్‌ వర్చ్యువల్‌ అసిస్టెంట్‌ ‘

‘అలెక్సా’కు  అమితాబ్‌ గొంతు

సుప్రసిద్ధ హిందీ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ఈయన బంధువు కాదు. అమెజాన్‌ వర్చ్యువల్‌ అసిస్టెంట్‌ ‘అలెక్సా’ను ఉపయోగిస్తే, వినియోగదారుడికి అమితాబ్‌ నుంచి సమాధానం వస్తుంది. అమితాబ్‌ గొంతును అమెజాన్‌ అరువు తీసుకుంటోంది. అలెక్సాను వినియోగదారుల్లోకి మరింతగా తీసుకుని వెళ్ళేందుకు అమెజాన్‌ సన్నద్ధమైంది.

సరిగ్గా ఏడాది క్రితమే అమెరికా నటుడు శామ్యూల్‌ ఎల్‌.జాక్సన్‌ గొంతును తీసుకున్నారు. దాన్ని అమెరికాకు పరిమితం చేసిన అమెజాన్‌, ఇప్పుడు మన దేశంలోని హిందీ వినియోగదారుల కోసం షెహన్‌షా అమితాబ్‌ బచ్చన్‌ గొంతును ఉపయోగించుకోనుంది. వచ్చే ఏడాది నుంచి అమెజాన్‌లో ఈ వాయిస్‌ ఆప్షన్‌ వినియోగంలోకి రానుంది.

ఒక ప్రముఖ నటుడి గొంతును వర్చ్యువల్‌ అసిస్టెంట్‌గా ఉపయోగించడం మన దేశంలో ఇదే మొదటి సారి. సందేహాలకు సమాధానం ఇచ్చే సందర్భంలో అమితాబ్‌ సినిమాలు, టీవీ షోలలో జనాదరణ పొందిన వాక్యాలను తీసుకోవచ్చని పలువురు ఊహిస్తున్నారు. జోక్స్‌, సూచనలు, సలహాల సమ్మిళతం చేసే అవకాశం ఉంది. అయితే ప్యాకేజ్‌ మొత్తం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మొత్తానికి వచ్చే సంవత్సరం అమితాబ్‌ బచ్చన్‌ గొంతును అమెజాన్‌ అలెక్సాలో వినవచ్చు. 


Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST