ఉసిరికాయ జ్యూస్‌

ABN , First Publish Date - 2021-11-27T18:28:13+05:30 IST

ఉసిరికాయలు - రెండు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, పుదీనా - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, బెల్లం - ఒకటేబుల్‌స్పూన్‌, బ్లాక్‌సాల్ట్‌ - చిటికెడు, నీళ్లు - అరకప్పు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.

ఉసిరికాయ జ్యూస్‌

కావలసినవి: ఉసిరికాయలు - రెండు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, పుదీనా - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, బెల్లం - ఒకటేబుల్‌స్పూన్‌, బ్లాక్‌సాల్ట్‌ - చిటికెడు, నీళ్లు - అరకప్పు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఆ ముక్కలను జార్‌లోకి తీసుకుని నిమ్మరసం, పుదీనా, అల్లం ముక్క, కొద్దిగా నీళ్లు పోసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత బెల్లం, బ్లాక్‌ సాల్ట్‌ వేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లటి జ్యూస్‌ సిప్‌ చేయాలి.

Updated Date - 2021-11-27T18:28:13+05:30 IST