Abn logo
Aug 3 2021 @ 23:08PM

అమ్మా.. బోనమో..

తాండూరులో బోనాలతో ఊరేగుతున్న మహిళలు

 తాండూరు :  తాండూరు మండలంలో ఆషాడ బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సాయిపూర్‌లోని గ్రామదేవతల  బోనాల ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. తాతా గుడిలోని ఈశ్వరమ్మ, కట్టమైసమ్మ అమ్మవార్లకు డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిం చుకున్నారు.  శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ పట్లోళ్ల దీప, కౌన్సిలర్‌ నీరజాబాల్‌రెడ్డి బోనమెత్తారు. ఉత్సవాల్లో పట్లోళ్ల నర్సింహులు, సావిత్రి, నర్సింహులు పాల్గొన్నారు.