అమ్మ మాట

ABN , First Publish Date - 2020-12-29T06:00:03+05:30 IST

స్కూల్‌ వదిలారు. బుజ్జి, చంటి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్నారు. ‘‘ఏమైనా విశేషాలు ఉంటే చెప్పు?’’

అమ్మ మాట

  స్కూల్‌ వదిలారు. బుజ్జి, చంటి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్నారు. ‘‘ఏమైనా విశేషాలు ఉంటే చెప్పు?’’ అని అడిగాడు చంటి. ‘‘అమ్మ మాట వింటే మనకు ఎంతో మేలు తెలుసా!’’ అన్నాడు బుజ్జి. ‘‘ఏమిటో చెప్పు?’’ అన్నాడు చంటి కుతూహులంగా. ‘‘ఈ మధ్య కరోనా కారణంగా స్కూల్‌ లేదని నేను చింతించలేదు. ఇంట్లోనే ఎంచక్కా ఆన్‌లైన్‌ క్లాసులు విన్నాను. పుస్తకాలన్నీ చదివేశా. చదువుకోవడంలో అమ్మ ఎంతో సహాయం చేసింది. ఇప్పుడు స్కూల్‌ తెరిచినా పర్వాలేదు. నాకు పాఠాలు అన్నీ వచ్చేశాయ్‌!’’ అంటూ నవ్వుతూ చెప్పాడు బుజ్జి.


‘‘అమ్మ మాటలో అంత గొప్పదనం ఉందా?’’ అని మళ్లీ అడిగాడు చంటి. ‘‘అవును! ఏదైనా పనిపై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మ చెప్పిన విధంగా మాస్క్‌ వేసుకుని బయటకు వెళ్లేవాడిని. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం మరవలేదు. సామాజిక దూరం ఇప్పటికీ పాటిస్తున్నాను. ఇవన్నీ అమ్మ చెప్పినవే’’ అన్నాడు బుజ్జి. ఆ మాటలు విన్న చంటికి అమ్మ మనసు ఎంత మంచిదో అర్థమయింది. ‘‘నేను కూడా అమ్మ మాట వింటాను. బుద్ధిగా చదువుకుంటాను’’ అన్నాడు చంటి. 

పంపినవారు

లక్కరాజు ప్రపుల్ల చంద్ర, ధర్మవరం


Updated Date - 2020-12-29T06:00:03+05:30 IST