అమ్మ ఒడి ఎగ్గొట్టడానికే వాయిదా

ABN , First Publish Date - 2021-10-14T14:27:25+05:30 IST

‘‘అమ్మఒడి పథకం కింద..

అమ్మ ఒడి ఎగ్గొట్టడానికే వాయిదా

కొవిడ్‌తో స్కూళ్లు మూసినా ఇచ్చామన్నారు...

ఇప్పుడేమో హాజరును బూచిగా చూపుతున్నారు: అచ్చెన్నాయుడు


అమరావతి(ఆంధ్రజ్యోతి): ‘‘అమ్మఒడి పథకం కింద జనవరిలో ఇవ్వాల్సిన మొత్తాన్ని జూన్‌కు వాయిదావేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకానికి ఎగనామం పెట్టే ప్రయత్నాల్లో ఇది భాగం’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఆరోపించారు. ‘‘అమ్మ ఒడి పథకం అమలుకు గతంలో హాజరు గురించి ప్రభుత్వం మాట్లాడలేదు. ఇప్పుడు హాజరును సాకుగా చూపించాలని చూస్తున్నారు. ఈ ఏడాది కరోనా వల్ల పాఠశాలలు తెరుచుకోకపోయినా అమ్మఒడి అమలు చేశామని ఆర్భాటంగా చెప్పుకొన్నారు. పాఠశాలలు తెరిచి విద్యార్థులు వెళ్తున్న సమయంలో 75 శాతం హాజరును బూచిగా చూపించి ఈ ఏడాది ఎగ్గొట్టాలని నిర్ణయించడం హేయం. ఈ పథకం అమల్లో మొదటి నుంచి జగన్‌ రెడ్డి మోసపూరితంగానే వ్యవహరిస్తున్నారు. 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో 44 లక్షల మందికే దీనిని వర్తింప చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-14T14:27:25+05:30 IST