Oct 21 2021 @ 13:09PM

'సమ్మతమే': ఆకట్టుకుంటున్న ఫస్ట్ గ్లింప్స్..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా వచ్చిన 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' సినిమాతో హిట్ దక్కించుకున్నాడు. అంతగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ నిర్మాతలకి మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఆయన 'సమ్మతమే' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇందులో కిరణ్ సబ్బవరం సరసన చాందినీ చౌదరి నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది. టైటిల్ అలాగే తాజాగా వదిలిన ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే కిరణ్ మరోసారి ప్రేమకథతోనే రాబోతున్నాడనిపిస్తోంది. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో ఉన్న యూత్‌కు కావాల్సిన అంశాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి.