మహిషాసుర మర్దినిగా అమ్మవారు

ABN , First Publish Date - 2021-10-15T06:03:27+05:30 IST

నగరంలోని దేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం నాటికి 8వ రోజుకు చేరాయి. అమ్మవార్లు అందరూ మహిషాసుర మర్ధిని అలంకారంలో భక్తులకు కరుణా కటాక్షాలు అందించారు.

మహిషాసుర మర్దినిగా అమ్మవారు
నెల్లూరు : మహిషాసురమర్దినిగా రాజరాజేశ్వరి

దేవీ నామస్మరణలతో మారుమోగిన ఆలయాలు

నెల్లూరు (సాంస్కృతికం) అక్టోబరు 13 : నగరంలోని దేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం నాటికి 8వ రోజుకు చేరాయి. అమ్మవార్లు అందరూ మహిషాసుర మర్ధిని అలంకారంలో భక్తులకు కరుణా కటాక్షాలు అందించారు. శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకారం కనుల పండువగా జరిగింది.   భవానీలు తమ దీక్షలు పూర్తయిన సందర్భంగా ఆలయ కల్యాణ మండపంలో ఇరుముడులు కట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఇరుముడులు సమర్పించి దీక్షలు విరమించారు. ఉత్సవాలను చైర్మన్‌ రత్నం జయరామ్‌, ఈవో సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరావురెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది పర్యవేక్షించారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సాధారణ భక్తుల క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలు చేశారు.

 కన్యకా పరమేశ్వరి ఆలయంలో 3 టన్నుల చెరకుతో గజలక్ష్మి అలంకారం

 స్టోన్‌హౌస్‌పేటలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాఽథ్‌ పర్యవేక్షణలో అమ్మవారికి 3 టన్నుల చెరకు గడలతో గజలక్ష్మి అలంకారం చేశారు. మూలవరులు, ఉత్సవమూర్తులు, ఆలయ ప్రాంగణం చెరుకు గడలతో అలంకరించారు. మూలవర్లుకు మహిషాసుర మర్దిని అలంకారం, ఉత్సవమూర్తికి గజలక్ష్మీ అలంకారాలు జరిగాయి. ఉదయం 9మంది చిన్నారులకు ‘కన్యకలు’ అలంకారంతోపాటు హోమం కన్యపూజ వైభవంగా జరిగింది. 

 మూలాపేట భువనేశ్వరి ఆలయంలో భువనేశ్వరికి మహిషాసుర మర్దిని అలంకారం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 1 నవావరణ పూజ, చంఢీహోమం, పూలంగిసేవలు జరిగాయి. శ్రీశైలం  ఉత్సవాలను ఆలయ ధర్మకర్త మండలి, ఈవో వేణుగోపాల్‌ పర్యవేక్షించారు. 

 ఉస్మాన్‌సాహెబ్‌ పేటలోని కోదండరామపురంలో ఉన్న మహాలక్ష్మీ ఆలయంలో అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకారం చేశారు.  కార్యక్రమాలను చైర్మన్‌ పత్తి నరసింహం, ధర్మకర్తలు పర్యవేక్షించారు. 

 మూలాపేట ఇరుకళల పరమేశ్వరి అమ్మవారికి మహిషాసురమర్దిని అలంకారం వైభవంగా జరిగింది. ఉత్సవాలను చైర్మన్‌ వట్టూరు సురేంద్రయాదవ్‌, ధర్మకర్తలు, ఈవో కడారి పెంచలప్రసాద్‌ పర్యవేక్షించారు. 

 నవాబుపేట శ్రీకృష్ణ ధర్మరాజుస్వామి ఆలయంలో ద్రౌపదీ దేవికి మషిషాసుర మర్దిని అలంకరణ చేశారు. ఉత్సవాలను ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్‌ మద్దూరి సుబ్బారావు పర్యవేక్షించారు. మూలాపేట శ్రీకృష్ణధర్మరాజుస్వామి ఆలయంలో ద్రౌపదీదేవికి మహిషాసుర మర్ధిని అలంకారం చేశారు. ఆలయ ఈవో డి.వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు పర్యవేక్షించారు. 

నవాబుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి మహిషాసుర మర్ధిని అలంకారం చేశారు. ఉత్సవాలను చైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి, ధర్మకర్తలు ఈవో నవీన్‌కుమార్‌, తదితరులు పర్యవేక్షించారు. 

 పప్పులవీధి మహాలక్ష్మి ఆలయంలో  అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలను పప్పులవీధి మిత్ర మండలి, మహాలక్ష్మి మహిళా మండలి, ఈవో కామేశ్వరరావులు పర్యవేక్షించారు. 

చిల్డ్రన్స్‌ పార్కు వీధిలోని లక్ష్మీ గణపతి, శివపార్వతిలు, శృంగేరీ శారదాదేవి ఆలయంలో మహిషాసుర మర్ధిని అలంకారం జరిగింది. ఉత్సవాలను వ్యవస్థాపక ధర్మకర్తలు సురేష్‌శర్మ, సత్యవాణి పర్యవేక్షించారు. 

 నగరంలోని అయ్యప్పగుడి గురువాయురప్పన్‌ మహావిష్ణు ఆలయంలో అమ్మవారికి మహిషాసురమర్దిని అలంకారం జరిగింది.  ఉత్సవాలను చైర్మన్‌ జి.శేషగిరిరావు, కార్యదర్శి వెంకటరత్నం, ధర్మకర్తలు పర్యవేక్షించారు. 

 పప్పులవీధి సిద్ధి విఘ్నేశ్వరాలయంలో మహిషాసుర మర్ధిని అలంకారం జరిగింది. ఉత్సవాలను ఆలయ చైర్మన్‌ బయ్యా ప్రసాద్‌, ధర్మకర్తలు, అర్చకులు మాచవోలు కోటేశ్వరశర్మ, తదితరులు పర్యవేక్షించారు.

రాంనగర్‌లోని శబరీ శ్రీరామక్షేత్రంలో సీతాదేవికి మహార్నవమి పూజలు, హోమాలు జరిగాయి. ఆలయ అర్చకులు నరేష్‌స్వామి హోమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి పర్యవేక్షించింది. 

మహ్మాగాంధీనగర్‌ కృష్ణమందిరంలో వైష్ణవీదేవికి సంతానలక్ష్మి అలంకారం జరిగింది. ఉభయకర్తలు, ఆలయ ధర్మకర్తలు పర్యవేక్షించారు. 

నెల్లూరురూరల్‌ : వేదగిరి క్షేత్రంలో ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.   దసరా మహోత్సవం సందర్భంగా శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

విజయదశమి శుభాకాంక్షలు

అందరూ ఆరోగ్యం, సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ కలెక్టర్‌  చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు  జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ  సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దినే్‌షకుమార్‌ వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.








Updated Date - 2021-10-15T06:03:27+05:30 IST