నేడు ‘అమ్మఒడి’ నిధులు విడుదల

ABN , First Publish Date - 2021-01-11T05:05:11+05:30 IST

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పథకం కింద సోమవారం నిధులు విడుదల కానున్నాయి. ఈమేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా కేంద్రంలోని కంట్మోనెంట్‌ మున్సిపల్‌ పాఠశాలలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు పథకాన్ని ప్రారంభిస్తారు.

నేడు ‘అమ్మఒడి’ నిధులు విడుదల


విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు రూ.15 వేలు జమ 

కలెక్టరేట్‌, జనవరి 10:  ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పథకం కింద సోమవారం నిధులు విడుదల కానున్నాయి. ఈమేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా కేంద్రంలోని కంట్మోనెంట్‌ మున్సిపల్‌ పాఠశాలలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 2,03,954 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.305.93 కోట్లను జమ చేయనున్నారు. ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేల వంతున పడనున్నాయి. అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం గత ఏడాది జనవరి 9న ప్రారంభించింది. అప్పట్లో చాలా మంది అర్హులకు ఈ  పథకం అందలేదు. దీంతో వారంతా అనేక మార్లు కలెక్టరేట్‌ స్పందనలో విన్నవించుకున్నారు. తప్పులను సరిచేసుకున్నా అప్పట్లో డబ్బులు జమ కాలేదు. ఈ ఏడాదైనా అందుతాయో లేదోనని ఎదురుచూస్తున్నారు. 

-----------


Updated Date - 2021-01-11T05:05:11+05:30 IST