అమ్మోర్లకు బోనం

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

అమ్మోర్లకు బోనం

అమ్మోర్లకు బోనం
మంబాపూర్‌లో బోనాలతో వెళుతున్న మహిళలు,

పెద్దేముల్‌/వికారాబాద్‌, జనవరి 28: పెద్దేముల్‌ మండలంలో గ్రామదేవతల బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మంబాపూర్‌, గాజీపూర్‌, గొట్లపల్లి గ్రామాల్లో ఊరడమ్మ  బోనాల ఉత్సవాలు జరిగాయి. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. మంబాపూర్‌లో జరిగిన ఊరడమ్మ జాతరలో పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఏర్పులమ్మ భవిష్యవాణి వినిపించింది. కాగా వికారాబాద్‌ మండల పరిధిలోని సర్పన్‌పల్లి, పీలారం గ్రామాల్లో మైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సర్పన్‌పల్లి సర్పంచ్‌ షకీరాపైల్వాన్‌ ఆధ్వర్యంలో, పీలారం గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు  అనంతరం అమ్మవార్లకు పూజలు  చేసి  నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డప్పు చప్పుల్లు  శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.  కాగా పీలారంలో  బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ పాల్గొని ప్రత్యేక పూజలు  చేశారు. 

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST