May 15 2021 @ 18:49PM

కరోనా నుంచి కోలుకున్న అమ్ము అభిరామి

కోలీవుడ్: కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తిలో అనేక మంది కోలీవుడ్‌ సెలెబ్రిటీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ వైరస్‌ సోకడంతో పలువురు మృత్యువాతపడ్డారు. మరికొందరు మరణం అంచులకు వెళ్ళి తిరిగి కోలుకున్నారు. ఇలాంటివారిలో నటి అమ్ము అభిరామి ఒకరు. ‘రాక్షసన్‌’, ‘అసురన్‌’ వంటి చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు పొందిన అమ్ము.. ఈనెల 3వ తేదీన వైరస్‌ బారినపడింది. ఆ తర్వాత హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిన ఆమె... వైద్యుల సూచనలు పాటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాను కరోనా వైరస్‌ బారినుంచి పూర్తిగా కోలుకున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించింది. అదేసమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరిస్తూ, స్వీయ రక్షణ పాటించాలని ఆమె విఙ్ఞప్తి చేసింది. 

అదేవిధంగా ప్రముఖ దర్శకుడు వసంతబాలన్‌ కూడా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఆయన గత నెల 21 నుంచి కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఒక దశలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. అయితే, నిపుణులైన వైద్యబృందం ఆయనకు చికిత్స అందించడంతో తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా వార్డు నుంచి సాధారణ వార్డుకు వసంతబాలన్‌ను మార్చారు. ఇదే విషయంపై ఆయన ట్వీట్‌ చేశారు. ప్రేమైక సమాజంలో జీవించడం ఒక వరం. అలాంటి సమాజంలో జీవించేందుకు మళ్ళీ వస్తున్నాను అని వసంతబాలన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.