భృతి లేదు.. భర్తీ లేదు!

ABN , First Publish Date - 2021-10-27T08:01:58+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో నానాటికీ నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయి. అటు ఉద్యోగ నియామకాలు లేక, ఇటు ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతీ చేతికందక తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. జనవరిలో మంత్రి కేటీఆర్‌ నిరుద్యోగ భృతిని..

భృతి లేదు.. భర్తీ లేదు!

  • నిరుద్యోగ భృతి ఊసెత్తని సర్కారు.. రూ.3016 ఇస్తామని 2018లో వెల్లడి
  • ‘వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ నిరుద్యోగులే 24.82 లక్షల మంది..
  • 29 లక్షలు ఉంటారంటున్న నిరుద్యోగ సంఘాలు
  • ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వ మౌనవ్రతం..
  • ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఖాళీలు 67,128
  • ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైలు పెండింగ్‌.. నిర్ణయంపై దోబూచులాట


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో నానాటికీ నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయి. అటు ఉద్యోగ నియామకాలు లేక, ఇటు ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతీ చేతికందక తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. జనవరిలో మంత్రి కేటీఆర్‌ నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ, 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ ప్రకటన అమలుకు నోచుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానైనా అందుతుందా అన్నది అనుమానమేనని నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం కూడా ఎటూ తేలడం లేదు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయే తప్ప.. అడుగు ముందుకు పడడం లేదు.  


ఆశలు ఆవిరి..

ఈ ఆర్థిక సంవత్సరం నుంచే భృతి వస్తుందని నిరుద్యోగులు ఎంతో ఆశపడ్డారు. మంత్రి కేటీఆర్‌ ప్రకటనతో మరిన్ని ఆశలు పెంచుకున్నారు. కానీ, ప్రభుత్వం ప్రకటనతోనే సరిపెట్టింది! 2018 ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతిని అందజేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. నిరుద్యోగులకు నెలకు రూ.3016 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తామని తెలిపింది. 2019-20 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1810 కోట్లను కేటాయించింది. నెలకు కనీసం రూ.150.88 కోట్లను వ్యయం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయినా ఆ ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు కాలేదు. కనీసం 2020-21లోనైనా అమలవుతుందని నిరుద్యోగులు భావించారు. అప్పుడూ మొండి చెయ్యే ఎదురైంది. ఇక ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చిన 2021-22 బడ్జెట్‌లో దీని ఊసే లేదు. కానీ, జనవరిలో కేటీఆర్‌ నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించారు. 9 నెలలు గడిచినా అది అమలు కాలేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. విధివిధానాలనూ ఖరారు చేయలేదు. అసలు నిరుద్యోగుల గుర్తింపు ప్రక్రియనే ప్రారంభించలేదు. టీఎ్‌సపీఎస్సీలో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద నమోదైన నిరుద్యోగులు 24,82,888 మంది ఉన్నారు. ఈ సంఖ్య 29 లక్షల వరకు ఉంటుందని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు వివరిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిననాటి నుంచి ప్రైవేటు రంగంలో తప్ప ప్రభుత్వ రంగంలో చెప్పుకోదగ్గ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని చెబుతున్నాయి. పోలీసు పోస్టులు భర్తీ అయ్యాయే తప్ప ఇతర శాఖల్లోని ఖాళీలు భర్తీ కాలేదని, ఫలితంగా చాలా మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారని విద్యార్థి నేతలు వివరిస్తున్నారు.  


ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు పుండు మీద కారం చల్లినట్లయింది. 58 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఇలాంటి సందర్భంలోనైనా నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోయిందని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత రమేశ్‌ ముదిరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్మెంట్‌ వయసును పెంచడంపై దృష్టి పెట్టిందే తప్ప.. తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే అంశాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. రాష్ట్రంలో మొత్తం 56,979 ఖాళీలున్నాయంటూ అధికారులు రాష్ట్ర మంత్రిమండలికి నివేదించారు. అయితే ఈ వివరాలు అసమగ్రంగా ఉన్నాయని మే రెండో వారంలో జరిగిన కేబినెట్‌ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. మళ్లీ కసరత్తు చేసిన అధికారులు 67,128 ఖాళీలున్నట్లు తేల్చారు. ఈ నివేదికను సీఎం కార్యాలయానికి పంపారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. ఇంకా సమీక్షలు జరగలేదు. ఫైలు సీఎంవోలోనే ఉందని అధికారులు చెబుతున్నారు.


పుండు మీద కారం..

ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు పుండు మీద కారం చల్లినట్లయింది. 58 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఇలాంటి సందర్భంలోనైనా నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోయిందని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత రమేశ్‌ ముదిరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, వయసును పెంచడంపై దృష్టి పెట్టిందే తప్ప.. తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే అంశాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. రాష్ట్రంలో మొత్తం 56,979 ఖాళీలున్నాయంటూ అధికారులు రాష్ట్ర మంత్రిమండలికి నివేదించారు. అయితే ఈ వివరాలు అసమగ్రంగా ఉన్నాయని మే రెండో వారంలో జరిగిన కేబినెట్‌ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. మళ్లీ కసరత్తు చేసిన అధికారులు 67,128 ఖాళీలున్నట్లు తేల్చారు. ఈ నివేదికను సీఎం కార్యాలయానికి అందజేశారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. ఇంకా సమీక్షలు జరగలేదు. ఫైలు సీఎంవోలోనే ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-10-27T08:01:58+05:30 IST