కేంద్ర కమిటీ అనుమతులతోనే నల్లమలలో మార్పులూ చేర్పులు

ABN , First Publish Date - 2021-10-23T08:48:29+05:30 IST

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు (నల్లమల)లో చేపట్టే ఎకో సెన్సిటివ్‌ ఎకనామిక్‌ రెసిడెన్షియల్‌ జోన్లో ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా..

కేంద్ర కమిటీ అనుమతులతోనే నల్లమలలో మార్పులూ చేర్పులు

శ్రీశైలం, సాగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో ఎకో జోన్‌పై కేంద్రం గెజిట్‌ విడుదల

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు (నల్లమల)లో చేపట్టే ఎకో సెన్సిటివ్‌ ఎకనామిక్‌ రెసిడెన్షియల్‌ జోన్లో ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా.. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదంతో జరగాల్సిందేనని ఆ శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం గెజిట్‌ విడుదల చేసింది. ఈ ఎకో సెన్సిటివ్‌ జోన్‌ 2,149.68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని పేర్కొంది. ఈ జోన్‌లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా రెండేళ్లలో మాస్టర్‌ ప్లాన్‌ను రాష్ట్రప్రభుత్వం సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-10-23T08:48:29+05:30 IST