Abn logo
Oct 23 2021 @ 03:20AM

జగన్‌ తల్లిని ఎవరూ తిట్టలేదు: అనిత

అమరావతి: ‘‘సీఎం జగన్‌రెడ్డి తన తల్లిని ఎవరో ఏదో అన్నారని తెగ బాధపడిపోతున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుకు బలిచేస్తే ఆ ఇంట్లో తల్లి, చెల్లి పెట్టిన కన్నీరు ఆయనకు కనిపించదా? చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంతకాలానికి తల్లి గుర్తుకు వచ్చింది. ఎవరో ఏదో అంటే దానికి విపరీతార్థాలు తీసి, దానిని తనకు అన్వయించుకొని ఎక్కడలేని బాధపడిపోతున్నారు. ఆయన తల్లిని ఎవరూ తిట్టలేదు. పదవిని నిలబెట్టుకోవడానికి దిగజారుతున్నారు’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.

క్రైమ్ మరిన్ని...