Abn logo
Oct 23 2021 @ 03:19AM

‘తమ్ముళ్లకు’ బీపీ వస్తే.. జగన్‌ తాట తీస్తారు: బుద్దా

విద్యాధరపురం, అక్టోబరు 22: తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్‌ తాట తీస్తారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు దీక్షలో ఆయన మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రని చంద్రబాబు రామరాజ్యంగా మారిస్తే జగన్‌ రాక్షస రాజ్యంగా మార్చారన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. 2024లో టీడీపీదే అధికారమని వెంకన్న స్పష్టం చేశారు. 

క్రైమ్ మరిన్ని...