Abn logo
Sep 26 2021 @ 03:03AM

కౌలు ఇవ్వలేరు.. మూడు రాజధానులు కడతారా?

648వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతుల ఆగ్రహం

తుళ్ళూరు, సెప్టెంబరు 25: రాష్ట్ర ఏకైక రాజఽధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమం శనివారంతో 648వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు ధర్నా శిబిరాల నుంచి మాట్లాడుతూ.. సీఎం జగన్‌రెడ్డి రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. అమరావతిని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో పాలకులు ఉన్నారని, పోరాడైనా రాజధానిని కాపాడుకుంటామని వారు స్పష్టంచేశారు. రైతుకు కౌలు జమ చేయకుండా ఇబ్బంది పెడుతున్న జగన్‌రెడ్డికి మూడు ముక్కలాట ఎందుకని ప్రశ్నించారు.