Abn logo
May 5 2021 @ 03:29AM

మాది ధర్మ పోరాటం.. మీది దుర్మార్గపు పాలన

అమరావతి రైతుల మండిపాటు .. 504వ రోజుకు  దీక్షలు 


తుళ్లూరు, మే 4: ‘మా పోరాటం అమరావతి అభివృద్ధి కోసం. రాష్ట్రం, ప్రజల కోసం. మీరు మూడు రాజధానుల పేరుతో అన్యాయమైన, దుర్మార్గపు పాలన చేస్తున్నారు’ అంటూ సీఎం జగన్‌పై రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 504వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరిట అమరావతి రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిందన్నారు. అమరావతి కోసం కన్నతల్లి లాంటి భూములను ఇచ్చామన్నారు. రాజధాని అభివృద్ధి చేయడం చేతకాక అవినీతి జరిగిందని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. జగన్‌రెడ్డి పాలనలో అన్నదాతకు రక్షణ లేదని వాపోయారు. 500 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు వివక్ష చూపుతున్న ప్రభుత్వంపై చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాజం చెప్పాలన్నారు. పాలకులు మారితే రాజధాని మారుతుందా.. అంటూ రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement