746వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

ABN , First Publish Date - 2022-01-02T01:57:08+05:30 IST

ఐదు కోట్ల మంది కోరుకున్న ప్రజా రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఎందుకు కాదంటుందని భూములు త్యాగం చేసిన రైతుల ప్రశ్నించారు.

746వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

తుళ్లూరు: ఐదు కోట్ల మంది కోరుకున్న ప్రజా రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఎందుకు కాదంటుందని భూములు త్యాగం చేసిన రైతుల ప్రశ్నించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శనివారంతో 746వ రోజుకు చేరుకుంది. నూతన సంవత్సర వేడుకలను కూడా రాజధాని రైతు ధర్నా శిబిరాలలో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ, మూడు ముక్కలు చేయాలనే ఆలోచన మానుకోవాలని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 33 వేల ఎకరాలు రాజధాని నిర్మాణ  కోసం ఇచ్చామన్నారు. పాడు బెట్టటానికి కాదన్నారు. రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టి  పాలకులు ఆనందం పొందుతున్నారన్నారు.  రైతులతో చర్చించి  సమస్యను పరిష్కరించాల్సి ఉండగా టెర్రరిస్టుల మాదిరిగా అమరావతి రైతులను సీఎం జగన్‌ రెడ్డి చూస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళను కొనసాగించారు. అమరావతి వెలుగు కార్యక్రమం దీపాలు వెలిగించి నిర్వహించారు. 

Updated Date - 2022-01-02T01:57:08+05:30 IST