అమరావతి రైతుల సంకల్ప ర్యాలీ

ABN , First Publish Date - 2021-01-20T17:45:23+05:30 IST

ఉద్యమంలో కొత్త స్ఫూర్తిని రగిల్చేందుకు అమరావతి రైతులు సంకల్ప ర్యాలీని నిర్వహిస్తున్నారు.

అమరావతి రైతుల సంకల్ప ర్యాలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు బుధవారం నాటికి 400వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్యమంలో కొత్త స్ఫూర్తిని రగిల్చేందుకు అమరావతి సంకల్ప ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ రైతుల ఉద్యమం స్ఫూర్తితో అమరావతి రైతులు బైక్, ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ తుళ్లూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిచంద్రపురం,  బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజు పాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి మీదుగా మందడం వరకు సాగనుంది. ఈ ర్యాలీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోపాటు.. గత కొన్ని రోజులుగా తాము చేస్తున్న దీక్షలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-01-20T17:45:23+05:30 IST