Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ పోలీసు అధికారా..రౌడీనా?: అమరావతి జేఏసీ

నెల్లూరు: మహాపాదయాత్రలో వెంకటగిరి‌ సీఐ నాగమల్లేశ్వరరావు ఓవరాక్షన్ చేశారని అమరావతి జేఏసీ నేతలు మండిపడుతున్నారు. మహిళలని అగౌరవపర్చడం, నెట్టడం దారుణమని అంటున్నారు. నాగమల్లేశ్వరరావు పోలీసు అధికారా..రౌడీనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం, అధికారులు ఉన్నంతవరకు ఎవరికీ న్యాయం జరగదని అంటున్నారు. శాంతియుతంగా యాత్ర చేస్తుంటే అడ్డంకులు కల్పిస్తారా? అని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికే కాదు పోలీసులకి కూడా తమపై కడుపుమంటగా ఉందని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చిరించారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement