Amravati రైతుల పాదయాత్రకు చెన్నై ప్రముఖుల మద్దతు

ABN , First Publish Date - 2021-12-06T17:17:56+05:30 IST

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ పంట పొలాలు త్యాగం చేసిన రైతులు చేపట్టిన పాదయాత్రకు చెన్నై ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో రైతులు చేపట్టిన పాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లా

Amravati రైతుల పాదయాత్రకు చెన్నై ప్రముఖుల మద్దతు

రూ.7 లక్షల విరాళం అందజేత


చెన్నై: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ పంట పొలాలు త్యాగం చేసిన రైతులు చేపట్టిన పాదయాత్రకు చెన్నై ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో రైతులు చేపట్టిన పాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా చెన్నై నుంచి వెళ్లిన సుమారు 50 మంది తెలుగు ప్రముఖు లు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడంతో పాటు రూ.7 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు నగదును అమరావతి జేఏసీ ప్రతినిధులకు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులైన ఆంధ్రా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఆస్కా) మాజీ అధ్యక్షుడు ఎం.ఆదిశేషయ్య, టీడీపీ చెన్నై ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌, చలపతి, నరేంద్ర చౌదరి, ఎం.రవిబాబు, శ్రీనివాస్‌రావు, బాబు, నిర్మలాదేవి, వసుంధరాదేవి, భీమాశంకర్‌, నాగేశ్వరరావు, నాగరాజు, తిరుపాల్‌నాయుడు, వసుంధరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ... రాజధాని కోసం రైతులు తమ పంట పొలాలను త్యాగం చేశారని కొనియాడారు. 


రాష్ట్రానికి మంచి జరుగుతుందని, భవిష్యత్తు తరాలు బాగుపడతాయన్న ఉద్దేశంతోనే వారు అంతటి త్యాగానికి పూనుకున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారిస్తే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదన్నారు. అది రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఇప్పుడు రైతులు చేస్తున్న పోరాటం తమ కోసం కాదని, రాష్ట్రం కోసమని గుర్తు చేశారు. అందుకే సాటి తెలుగువారిగా చెన్నైలో స్థిరపడిన తామంతా రైతుల పాదయాత్రకు మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. రైతులు చేస్తున్న పోరాటాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ పోరాటానికి మునుముందు కూడా తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-06T17:17:56+05:30 IST