Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి రైతులకు మద్దతుగా జంగారెడ్డిగూడెంలో పాదయాత్ర

జంగారెడ్డిగూడెం:  అమరావతి రైతులకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆధ్యర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పేరుతో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కోర్టు వద్ద నుంచి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకూ ఈ యాత్ర కొనసాగింది. జంగారెడ్డిగూడెం పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరిగింది.


మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదాలు చేస్తూ తెలుగుదేశం శ్రేణులు కదం తొక్కాయి. రాజధాని అమరావతికి 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులను నట్టేట్లో ముంచుతూ ముఖ్యమంత్రి తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిని అయిదు కోట్ల ఆంధ్రుల రాజధానిగా గుర్తించాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేసారు. ఈ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Advertisement
Advertisement