ఇద్దరు మహిళలపై ఆలయ పూజారి అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-05-19T14:56:22+05:30 IST

ఓ దేవాలయం ఆవరణలోని ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అక్రమంగా నిర్బంధించిన ఆలయపూజారి వారిపై పదేపదే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ...

ఇద్దరు మహిళలపై ఆలయ పూజారి అఘాయిత్యం

అమృత్‌సర్ ప్రధాన పూజారి దారుణం...

అమృత్‌సర్ (పంజాబ్): ఓ దేవాలయం ఆవరణలోని ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అక్రమంగా నిర్బంధించిన ఆలయపూజారి వారిపై పదేపదే అత్యాచారం జరిపిన దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరంలో వెలుగుచూసింది. అమృత్‌సర్ నగరంలోని లోపోక్ పోలీసుస్టేషను పరిధిలోని రామ్ తీర్థ్ కాంప్లెక్స్ లోని గురు జ్ఞాన్‌నాథ్ ఆశ్రమ వాల్మీకి తీర్థ్ ప్రధాన పూజారిగా మహంత్ మోహన్ గిర్దారీనాథ్ వ్యవహరిస్తున్నారు. ఆలయ పూజారి అయిన గిర్దారీనాథ్ తమను నిర్బంధించి పలుసార్లు అత్యాచారం చేశాడని ఇద్దరు బాధిత మహిళలు పంజాబ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు తర్సీంసింగ్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. కమిషన్ సభ్యుడు తర్సీంసింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేర తాము ఆలయం ఆవరణలోని ఆశ్రమం రహస్య స్థావరాలపై దాడి చేసి ఆలయ ప్రధాన పూజారి మోహన్ గిర్దారీనాథ్, అతని సహచరుడు వరీందర్ నాథ్ లను అరెస్టు చేశామని డీఎస్పీ అటారీ గురు ప్రతాప్ సింగ్ చెప్పారు. పోలీసుల దాడి సందర్భంగా పూజారి అనుచరులైన నాచత్తర్ సింగ్, సూరజ్ నాథ్ లు తప్పించుకు పారిపోయారు. పారిపోయిన వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు. ఆశ్రమంలో అత్యాచారం బాగోతాల గురించి ప్రధాన పూజారితోపాటు అతని సహచరుడు వరీందర్ నాథ్ లను విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-05-19T14:56:22+05:30 IST