ఐదు అలవాట్లతో గుండెకు రక్ష!

ABN , First Publish Date - 2022-01-24T05:38:38+05:30 IST

ఐదు అలవాట్లు గుండె పోటు ముప్పు నుంచి కాపాడతాయని అంటున్నారు వైద్యనిపుణులు. వీటిని పాటించడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. ఆ సూచనలు ఇవి....

ఐదు అలవాట్లతో గుండెకు రక్ష!

హెల్త్‌ రూల్స్‌

ఐదు అలవాట్లు గుండె పోటు ముప్పు నుంచి కాపాడతాయని అంటున్నారు వైద్యనిపుణులు. వీటిని పాటించడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. ఆ సూచనలు ఇవి....

శ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా లభించే ఆలివ్‌ ఆయిల్‌, ఆవనూనె, అవిసెగింజల నూనె వంటి వాటిని తీసుకోవాలి. వీటిమోతాదు నెలకు అర లీటరు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు నట్స్‌, ప్రొటీన్‌ ఫుడ్‌, పీచుపదార్థం అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం వీలైనంత తక్కువ తినాలి.

 ప్రతిరోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. వారంలో ఐదు సార్లు ఇలా చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని వెల్లడైంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ తగ్గుతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎక్కువ శాతం గుండె జబ్బులకు స్మోకింగ్‌, ఆల్కహాల్‌ కారణమవుతున్నాయి. ఈ అలవాట్లు లేని వారితో పోలిస్తే అలవాటు ఉన్న వారిలో 50 శాతం రిస్క్‌ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి స్మోకింగ్‌, ఆల్కహాల్‌ అలవాటు మానేయాలి.

నిద్ర మానసిక ఆరోగ్యానికే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. 

ఈ అలవాట్లతో పాటు క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. బి.పి, కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌, కిడ్నీ, లివర్‌, థైరాయిడ్‌ పనితీరు పరీక్షలు, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు, ఈసీజీ వంటి పరీక్షలు చేయించాలి.

Updated Date - 2022-01-24T05:38:38+05:30 IST