అమెరికా సుప్రీం జడ్జిగా బారెట్‌ ప్రమాణం

ABN , First Publish Date - 2020-10-28T09:45:18+05:30 IST

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనీ బారెట్‌ ప్రమాణం చేశారు. శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌ సమక్షంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి

అమెరికా సుప్రీం జడ్జిగా బారెట్‌ ప్రమాణం

  • 52-48 ఓట్లతో సెనెట్‌ ఆమోదం.. ట్రంప్‌కు సానుకూలం

వాషింగ్టన్‌, అక్టోబరు 27: అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనీ బారెట్‌ ప్రమాణం చేశారు. శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌ సమక్షంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ ఆమెతో ప్రమాణం చేయించారు. ట్రంప్‌ ప్రతిపాదిత జడ్జిగా బారెట్‌ సుప్రీంకోర్టులో కీలకం మారనున్నారు. బారెట్‌ను డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించినా.. రిపబ్లికన్ల ఆధిక్యం ఉన్న సెనెట్‌ ఆమె ఎంపికకు 52-48 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఆ వెంటనే శ్వేతసౌధం లాన్స్‌లో జడ్జిగా బారెట్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ట్రంప్‌ వర్గానికి ఇదో సానుకూల అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. 48 ఏళ్ల బారెట్‌ నియామకంతో సుప్రీంలో కన్వర్జేటివ్‌ల బలం పెరిగినట్టయింది. అమెరికన్లపై ప్రభావం చూపనున్న అబార్షన్‌, ఒబామాకేర్‌ వంటి అంశాల్లో బారెట్‌ తీర్పులు కీలకం కానున్నాయి. ఇదో చిరస్మరణీయ దినమని అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. నిష్పక్షపాలనకు శుభసంకేతమని వ్యాఖ్యానించారు. బారెట్‌ సంప్రదాయ కేథలిక్‌ కావడంతో ట్రంప్‌ నిర్ణయాలకు ఆమె బలం చేకూరుస్తారని భావిస్తున్నారు. 

Updated Date - 2020-10-28T09:45:18+05:30 IST