రూ.34.05 కోట్ల అదనపు నిధులు

ABN , First Publish Date - 2022-05-10T05:12:11+05:30 IST

నారాయణపేటలో రూ.82.44 కోట్ల అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాప న చేశారు.

రూ.34.05 కోట్ల అదనపు నిధులు
సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేటీఆర్‌, పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు

- గిరిజనుల కోసం సేవాలాల్‌ భవనం కట్టిస్తాం

- కంసాన్‌పల్లిలో 156 కుటుంబాలకు పట్టాలు అందిస్తాం

- 800 ఎకరాల్లో అగ్రికల్చర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం

- వరాల జల్లు కురిపించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారకరామారావు

నారాయణపేట/ టౌన్‌, మే 9 : నారాయణపేటలో రూ.82.44 కోట్ల అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాప న చేశారు. అనంతరం చేసిన  స్థానిక క్రీడా మైదానంలో జరిగిన ప్రగతి సభలో ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి కోరిన పనులన్నింటికీ అదనంగా రూ.34.05 కోట్లు మంజూరు చేస్తూ వరాల జల్లు కురిపించడంతో ప్రజల నుంచి హర్షాతీరేకాలు వెలువడ్డాయి. దామరగిద్ద మండలం కంసాన్‌పల్లిలో 156 కుటుంబాలు 200 ఎకరాల్లో 40 ఏళ్లుగా సాగులో ఉన్నవారికి పట్టాలు లేకపోవడంతో వారసత్వం కింద వారికి పట్టాలు ఇప్పించాలని, మరో 800 ఎకరాల్లో అగ్రికల్చర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చే యాలని, శాశ్వత తాగునీటి ఎద్దడి నివారణకై అదనంగా మరో రూ.28 కోట్లు నిధులు మం జూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. క్రీడా మైదానం నిర్మాణానికి అదనంగా మరో రూ.4 కోట్లతో పాటు ముస్లింలకు ఈద్గా మాడ్రనైజేషన్‌ కోసం 2.05 కోట్లు మంజూరు చేయాలని, గిరిజనుల కోసం సేవాలాల్‌ భవనాన్ని నిర్మించాలని మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే సభా ముఖంగా కోరారు. అందుకు స్పందించిన మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యే అడిగిన అన్నీంటికి నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మిషన్‌ భగీరథకు అదనంగా రూ.28 కోట్లు, క్రీడా మైదానానికి రూ.4 కోట్లు, ఈద్గాకు 2.05 కోట్లు ఇలా మొత్తం రూ.34.05 కోట్లు నిధులను మంజూరుతో పాటు సేవా లాల్‌ భవనాన్ని కూడా సుందరంగా నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌లను ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి శాలువాతో సత్కరించారు. జిల్లాలో మహిళా సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న అరుణ్య ఉత్పత్తులను ఇక నుంచి ప్లిప్‌ కార్డు ద్వారా అమ్మకాలు జరిపేందుకు ఎంఓయూ అగ్రి మెంట్‌ చేసుకోవడం అభినందనీయమని మంత్రి కేటీఆ ర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మా ర్కెట్‌ చైర్మన్‌ సరాఫ్‌ నాగరాజు కేటీఆర్‌బాగున్నావా అం టూ అప్యాయంగా పలకరించారు. అంతకుముందు ఎమ్మెల్యే రైతు వేదికలకు కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్‌, ప్రిం టర్‌ పంపిణీ చేశారు. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు రూ.7 కోట్ల చెక్కు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు రూ.50 కోట్ల చెక్కును మంత్రి కేటీఆర్‌ మహిళలకు అందించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్త చనిపోవడం వల్ల టీఆర్‌ఎస్‌ సభ్యత్వం ఉండడంతో రూ.2లక్షల చెక్కును బాధిత కుటుంబానికి మంత్రి అందించారు. దళిత బంధు లబ్ధిదారులకు 65 ట్రాక్టర్లు, ట్రాన్స్‌ఫోర్ట్‌ వాహనాలకు సంబంధించి 14 బొలెరోలు, రెండు కార్లు పంపిణీ చేయగా 15 మంది దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. అంతకుముందు చేపల మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ లోపలికి వెళ్లి మత్స్యకారులతో మాట్లాడారు.  చికెన్‌ మార్కెట్‌లో లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు. వయో వృద్ధుల గృహంలో  మొక్కలు నాటి నీరు పోశా రు. కార్యక్రమంలో  ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్యయా దవ్‌, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, వాణిదేవి, కలెక్టర్‌ హరిచందన, అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, ఎస్పీ వెంకటేశ్వర్లు, ము నిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, పుర వైస్‌ చైర్మన్‌ హరినారాయణభట్టడ్‌, జడ్పీ చైర్‌ పర్సన్లు వనజ, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖ, జిల్లా సమ న్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరిత, ట్రెడ్‌ చైర్మన్‌ దేవరి మల్లప్ప, మైనార్టీ చైర్మన్‌ ఇంతియాజ్‌, గిరిజన సంక్షేమ చైర్మన్‌ వాల్యా నాయక్‌, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అంజలి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ భాస్కరకుమారి, వైస్‌ చైర్మన్‌ జగదీశ్‌, డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రకాంత్‌, విజయ్‌ సాగర్‌, చెన్నారెడ్డి, వేపూరి రాములు, శ్రీపాద్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, పరిశ్రమలు, మునిసిపల్‌ రాష్ట్ర స్థాయి అధికారులు జేఎస్‌ రంజన్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ..

మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి కాన్వాయ్‌ ముందు ఆ పార్టీ శ్రేణులు సింగారం చౌరస్తా నుంచి పట్టణ పురవీధుల గుండా భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో క్రీడామైదానానికి చేరుకున్నారు. అదే విధంగా వివిధ వార్డులకు చెందిన నాయకులు, పార్టీ శ్రేణులు డప్పుల మోత మధ్య ర్యాలీగా, నృత్యాలు చేస్తూ సభాస్థలికి చేరుకున్నారు. 

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నారాయణపేట జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ రూ.82.44 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  రోడ్డు మార్గం గుండా హైదరాబాద్‌ నుంచి నారాయణపేట సింగారం చౌరస్తాకు చేరుకున్న మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచం దన, పుర చైర్‌పర్సన్‌ అనసూయ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం సింగారం చౌరస్తా సమీపంలో రూ.29.59 కోట్లతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా పేట మునిసిపాలిటీకి నీటి సరఫరా సంప్‌హౌజ్‌ను, రూ.1.68 కోట్లతో ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి బీసీకాలనీ గుట్ట దగ్గర రూ.20 కోట్లతో గోల్డ్‌ సోక్‌ హబ్‌ మార్కెట్‌ సమూదాయానికి, రూ.1.20 కోట్లతో బీసీ కాలనీ పార్కు ఏర్పాటుకు, రూ.6.65 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణానికి, ఎర్రగుట్ట దగ్గర రూ.2 కోట్లతో జిల్లా గ్రంథాలయ నిర్మాణం, రూ.కోటితో మాడలైజేషన్‌ ఆఫ్‌ లాండ్రికి, రూ.1.20 కోట్లతో మునిసిపల్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ.1.35 కోట్లతో హైటెక్‌ హంగులతో నిర్మించిన చేపల, చికెన్‌ మార్కెట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సుభాష్‌రోడ్‌లో రూ.12 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు, రూ.4 కోట్లతో కొండా రెడ్డిపల్లి చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. పేరపళ్ల రోడ్డు శివాలయం వద్ద రూ.1.10 కోట్లతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన అనంతరం రూ.87.45 లక్షలతో మిషన్‌ వస్ర్తాలయ పథకం ద్వారా చైల్డ్‌ హోం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 



Read more