ద్రవిడ్‌కు మరీ ఇంత కోపమా?.. వీడియో షేర్ చేసిన కోహ్లీ

ABN , First Publish Date - 2021-04-10T02:49:32+05:30 IST

రాహుల్ ద్రవిడ్.. జెంటిల్‌మెన్ గేమ్‌కు అతడు సరైన నిర్వచనం. అభిమానులతో ‘వాల్‌’గా పిలిపించుకునే

ద్రవిడ్‌కు మరీ ఇంత కోపమా?.. వీడియో షేర్ చేసిన కోహ్లీ

న్యూఢిల్లీ: రాహుల్ ద్రవిడ్.. జెంటిల్‌మన్ గేమ్‌కు అతడు సరైన నిర్వచనం. అభిమానులతో ‘వాల్‌’గా పిలిపించుకునే ద్రవిడ్ ఎంత సౌమ్యంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలోనే కాదు, బయట కూడా అతడు ఎంతో సౌమ్యంగా కనిపిస్తాడు. అలాంటి ద్రవిడ్‌ కోపంతో ఊగిపోతే.. నమ్మశక్యంగా లేదు కదూ.


కోపంతో ఊగిపోతూ కారు అద్దాలు బద్దలుగొడితే.. ఊహించడానికి కూడా ఇబ్బందిగా ఉంది కదూ. అయితే, ఈ వీడియో చూడండి. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని షేర్ చేసి కోహ్లీ.. ‘‘రాహుల్ భాయ్‌ను ఇలా ఎప్పుడూ చూడలేదు’’ అని దానికి క్యాప్షన్ తగిలించాడు. 


ఆ వీడియోలో ద్రవిడ్ నిజంగానే వీరావేశంతో ఊగిపోవడం, ఆగ్రహంతో ఇతరులపై అరుస్తుండడం వంటివి కనిపిస్తాయి. అంతేకాదు, ఒకానొక సమయంలో పక్కనే ఉన్న కారు రియర్ వ్యూ మిర్రర్‌ను బ్యాట్‌తో బాదడం వంటివి వీడియోలో కనిపిస్తాయి. అంతా చేస్తే ఇది ఓ ప్రకటన కావడం కొసమెరుపు. 

Updated Date - 2021-04-10T02:49:32+05:30 IST