Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం

ఎమ్మెల్సీ అభ్యర్థి నగేష్‌


సూర్యాపేటటౌన్‌, నవంబరు 28: సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడడం ఖాయమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఎమ్మె ల్యే కుడుదుల నగేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆత్మగౌరవం కోల్పోయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్‌ బాడీ సమావేశాల్లో తప్ప కనీసం కుర్చునేందుకు కుర్చీలు కూడా లేని పరిస్థితి  ఉందన్నారు. రెండున్నర ఏళ్లుగా నిధులు రాక, ఏ ఒక్క అభివృద్ధి పనులు లేక, ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతున్నామని అన్నారు. త్వరలో నిర్వహించనున్న ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల హక్కులను సాధించే వరకు పోరాటాలు చేస్తానని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్యం, డబ్బులు పంపిణీచేస్తూ అపహాస్యం చేస్తోందన్నారు. సమావేశంలో నాయకులు గుడుగుండ్ల శ్రీనివాస్‌, ప్రమోద్‌కుమార్‌, రమే్‌షరాజు, పవన్‌, శ్రీనివాస్‌, నాగరాజు, ఉపేందర్‌, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement