కేసీఆర్‌ పాలనకు చరమగీతం

ABN , First Publish Date - 2022-01-22T05:58:50+05:30 IST

రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడి, బహుజ న రాజ్యాధికారం తీసుకొస్తామని బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

కేసీఆర్‌ పాలనకు చరమగీతం
నల్లగొండ జిల్లా కేంద్రంలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 


నల్లగొండ టౌన్‌, జనవరి 21: రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడి, బహుజ న రాజ్యాధికారం తీసుకొస్తామని బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన బీఎస్పీ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బహుజ న రాజ్యాధికారమంటే ఏంటో ప్రజలకు వివరిస్తామన్నా రు. ఎన్నడూలేని విధంగా జిల్లాలో బీఎస్పీ ముందుకు దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. ఈనెల 15న బీఎస్పీ అధినేత్రి మాయావ తి జన్మదినాన్ని పురస్కరించుకొని బహుజన రాజ్యాధికార యాత్రను చేపట్టి 365 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించామని తెలిపారు. కొవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత ప్రభుత్వం ఆరోగ్య సూచనలు గౌరవిస్తూ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెప్పారు. ప్రతిపక్షాలకే ఒమైక్రాన్‌ నిబంధనలు వర్తిస్తాయా, అధికార పార్టీ రైతుబంధు యాత్రల పేరుతో కొవిడ్‌ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ పట్టపగ లే నడిరోడ్డున వేలాది మందిని తీసుకొచ్చి సంబరాలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. క్షీరాభిషేకాలు, సమావేశాల పేరుతో కొవిడ్‌ వ్యాప్తికి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీనే కారణమవుతుందని ఆరోపించారు. విద్యా సంస్థలకు రూ.7,300 కోట్లు ఇస్తానని సీఎం చెబుతున్నారని, అయితే ఆ డబ్బును ఈ ఏడాది ఇస్తారా లేక వచ్చే ఏడాది ఇస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో విద్యారంగానికి ఎన్ని కోట్లు ఇచ్చారు, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 గురుకులాలను ఏర్పాటు చేశారని, ఇంత వరకు ఒక్క గురుకులానికి సొంత భవనానికి నిధులు ఇవ్వలేదన్నారు. పక్క రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభిస్తున్నారని, తెలంగాణలో మాత్రం సెలవులు ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి రాజు, కార్యదర్శి వెంకటేష్‌ చౌహాన్‌, జిల్లా ఇన్‌చార్జిలు పూదరి నర్సింహ, పూదరి సైదులు, జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్‌, మహిళా కన్వీనర్లు ఇంద్రపల్లి కవిత, నర్న నిర్మల, కోడి భీంప్రసాద్‌, అక్కెపాక శ్రీనివాస్‌, పంబాల అనిల్‌, ఆదిమల్ల గోవర్థన్‌, వంటెపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:58:50+05:30 IST