బర్డ్‌లో ఓపీ కోసం అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-01-21T07:06:38+05:30 IST

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్‌ ఆస్పత్రిలో ఓపీ సేవలకు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని ప్రత్యేకాధికారి డాక్టర్‌ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి వెల్లడించారు.

బర్డ్‌లో ఓపీ కోసం అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి

రోగుల సహాయార్థం హెల్ప్‌ డెస్క్‌ 

ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి వెల్లడి


తిరుపతి, జనవరి 20: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్‌ ఆస్పత్రిలో ఓపీ సేవలకు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని ప్రత్యేకాధికారి డాక్టర్‌ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని రోగులకు ఇబ్బందులు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. అలాగే వైద్యం కోసం వచ్చే రోగులు క్యూలో నిలబడకుండా ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. అపాయింట్‌మెంట్‌ కోసం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల్లోపు 73373 18107 నెంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు.

Updated Date - 2022-01-21T07:06:38+05:30 IST