Honey Trap : ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు కీలక సమాచారం లీక్ చేసిన సైనికోద్యోగి

ABN , First Publish Date - 2022-05-21T23:32:00+05:30 IST

భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా

Honey Trap : ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు కీలక సమాచారం లీక్ చేసిన సైనికోద్యోగి

న్యూఢిల్లీ : భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా పాకిస్థాన్‌కు అందజేసినందుకు సైనికోద్యోగి ప్రదీప్ కుమార్‌ను రాజస్థాన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మహిళా ఏజెంట్ విసిరిన వలలో ప్రదీప్ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 


రాజస్థాన్ పోలీసు  (Rajasthan Police) ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఉమేశ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, ప్రదీప్ కుమార్ (Pradeep Kumar) (24) జోధ్‌పూర్‌లో పని చేస్తున్నారు. ఆయనకు ఓ పాకిస్థానీ (Pakistani) మహిళ ఫేస్‌బుక్ (Facebook) ద్వారా పరిచయమైంది. ఆమె పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్. ఆమె తనను తాను హిందువుగా పరిచయం చేసుకుంది. తాను మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉంటున్నానని, తన పేరు చాదమ్ అని చెప్పింది. తాను బెంగళూరులో ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసినట్లు చెప్పింది. కొన్ని నెలల తర్వాత ప్రదీప్ పెళ్లి పేరుతో ఢిల్లీ వెళ్ళారు. ఆ మహిళకు సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రాధాన్యంగల సమాచారాన్ని పంపించిన చిత్రాలు బయటపడ్డాయి. 


ఆరు నెలల క్రితం వాట్సాప్ ద్వారా వీరిద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారు. సైన్యానికి సంబంధించిన రహస్య పత్రాలను వాట్సాప్ ద్వారా ఆ మహిళకు ప్రదీప్ పంపించారు. ఇతర సైనికులను కూడా ఈ కుట్రలో పాలుపంచుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రదీప్ స్నేహితురాలిని కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. ప్రదీప్‌ను మే 18న అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, మే 21న అరెస్టు చేశారు. 


Updated Date - 2022-05-21T23:32:00+05:30 IST