Abn logo
Feb 24 2021 @ 22:41PM

గూడూరు అభివృద్ధికే డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌!

గూడూరు, ఫిబ్రవరి 24: గూడూరు అభివృద్ధి సంక్షేమం కోసం గ్రేటర్‌ గూడూరు డెవలెప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశామని కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి అన్నారు. స్థానిక రోటరీభవన్‌లో గ్రేటర్‌గూడూరు డెవలప్‌మెుంట్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రాత్మకంగా గుర్తింపు పొందిన గూడూరులో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు ఒంటెద్దు పోకడలు పోవడం హేయమైన చర్య అన్నారు.  గూడూరుకు ఐకాన్‌గా ఉన్న టవర్‌క్లాక్‌కు, బాటసారు లకోసం పుల్లమ్మ, కామాక్షమ్మల దాతృత్వంతో నిర్మించిన సత్రాలు శిథిలావస్థకు చేరడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు వాటిని కూల్చివేసి నూతన కట్టడాలు కట్టడం మంచిదే కానీ,  దాతల కుటుంబసభ్యులకు తెలపకుండా తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ చర్యలను ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గూడూరును అభివృద్ధి చేసేవారికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీకంఠి రామ్మోహన్‌రావు, గోపికృష్ణ, దశరఽథరామిరెడ్డి, రియాజ్‌అహ్మద్‌, నాశిన భాస్కర్‌గౌడ్‌, దేవానంద్‌, వాయుగండ్ల సుధాకర్‌, ఆరికట్ల బాలకృష్ణమ నాయుడు, హనుమంతరావు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement