Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 27 2021 @ 14:47PM

హర్యానా హోం మంత్రిత్వ శాఖ ఉద్యోగి అరెస్ట్

చండీగఢ్ : హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ కార్యాలయంలో రహస్య పత్రాలను దొంగింలించారనే ఆరోపణలపై ఓ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఈ ఉద్యోగి తన మొబైల్ ఫోన్‌తో రహస్య ఫైళ్ళ ఫొటోగ్రాఫ్‌లు తీస్తుండగా పట్టుబడినట్లు సమాచారం. అనిల్ విజ్ ఆ ఉద్యోగి మొబైల్‌ఫోన్‌ను తనిఖీ చేసి, విలేకర్ల సమక్షంలో పోలీసులను పిలిచినట్లు తెలుస్తోంది. 


అనిల్ విజ్ హోం మంత్రిత్వ శాఖతోపాటు ఆరోగ్యం, అర్బన్ బాడీస్, టెక్నికల్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్లను కూడా నిర్వహిస్తున్నారు. ఈ శాఖలకు చెందిన చాలా ముఖ్యమైన సమాచారం అక్రమంగా బయటకు పొక్కుతోందనే అనుమానాన్ని అనిల్ విజ్ వ్యక్తం చేశారు. దీంతో సచివాలయంలో కలకలం మొదలైంది. 


ఇదిలావుండగా తనను క్షమించాలని ఆ ఉద్యోగి తీవ్రంగా విలపించారు. కార్యాలయం వెలుపల నేలపై పడుకుని అనిల్ విజ్‌ను వేడుకున్నారు. పోలీసులు అనిల్ విజ్ ఫిర్యాదుపై ఆ ఉద్యోగిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రహస్య సమాచారాన్ని ఎవరికి పంపించారో, దాని వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement