సంక్షేమంలో దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-21T05:14:10+05:30 IST

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

సంక్షేమంలో దేశానికే ఆదర్శం
లబ్ధిదారుకు పెన్షన్‌ పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- లబ్ధిదారులకు పెన్షన్‌ పత్రాలు పంపిణీ 

- మహిళలకు బతుకమ్మ చీరలు అందజేత

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 20 : రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.  రాజ్యాంగంలో పేర్కొన్న సంక్షేమ రాజ్యమనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. పట్టణ పరిధిలో కొత్తగా ఎంపికైన 1,279 మంది లబ్ధిదారులకు పట్టణంలోని ప్యారడైజ్‌ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌లతో కలిసి ఆయన పెన్షన్‌ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలో రూ.50, కాంగ్రెస్‌ హయాంలో రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2016కు పెంచిన సీఎం కేసీఆర్‌, నిరుపేదల ఇంటికి పెద్ద కొడుకుగా నిలిచారన్నారు. పట్టణంలో ని అన్నివార్డుల్లో సీసీరోడ్డు, డ్రైయినేజీలు, వైకుంఠధా మాల నిర్మాణంతో పాటు ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం ద్వారా పట్టణం రూపురేఖలను మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు.  మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తోడ్పాటుతో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.  ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉన్నా వారందరికీ పెన్షన్లు అం దించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ, రైతుబంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, కౌన్సిలర్లు, మునిసిపల్‌ అధికారులు పాల్గొన్నారు.


ఆడపడచులకు ప్రభుత్వ కానుక

బతుకమ్మ చీరలు ప్రభుత్వం ఆడపడచులకు ఇచ్చే కానుక అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.  మంగళవారం సాయంత్రం పట్టణంలోని నల్లకుంట శివాలయం వద్ద 20, 21వ వార్డులకు చెందిన మ హిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మహేశ్వరి, నరహరి శ్రీనివాసులు,  మల్దకల్‌ ఎంపీపీ రాజారెడ్డి, గద్వాల తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, నాయకులు సుధాకర్‌, కురుమన్న పాల్గొన్నారు. 


కుల వృత్తులకు సంపూర్ణ తోడ్పాటు

రాష్ట్రంలో కుల వృత్తులను ఆదరించి ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని  ఎమ్యెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి అన్నారు. నిరాదరణకు గురవుతున్న కుల వృత్తులను ఆదుకు నేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం తెలిపా రు. జోగుళాంబ గద్వాల జిల్లా నాయీ బ్రాహ్మ ణసేవా సంఘం నూతన కమిటీ మంగళవారం స్థానిక హరిత హోటల్‌లో ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందడుగు వేయాలని సూ చించారు.  ప్రమాణ స్వీకారం చేసిన నాయీ బ్రా హ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు భగీరథ వంశీ, వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 21న ఎమ్యెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని కేట్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ రామేశ్వరమ్మ, ఎంపీపీ విజయ్‌, జడ్పీటీసీ సభ్యులు రాజ శేఖర్‌, పద్మవెంకటేశ్వర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ నరహరి శ్రీనివాసులు, నాయి బ్రాహ్మణ సంఘం గద్వాల అధ్యక్షుడు శ్రీనివాసులు,  జమ్ములమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్‌ జానకిరాములు ఉన్నారు.


Updated Date - 2022-09-21T05:14:10+05:30 IST