జో బైడెన్ వెనుక భారతీయ యువకుడు...

ABN , First Publish Date - 2020-12-03T23:14:23+05:30 IST

జో బైడెన్ వెనుక భారతీయ యువకుడు...

జో బైడెన్ వెనుక భారతీయ యువకుడు...

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కు ఆసియా సంతతి ఓటర్లు పూర్తి మద్దతు సాధించడంలో... అమిత్ జారీ అనే భారతీయుడు కీలకపాత్ర పోషించడం విశేషం. గుజరాత్ లోని రాజ్‌కోటకు చెందిన ముప్ఫై ఏళ్ళ  ఈ భారతీయ అమెరికన్ యువకుడు  చురుకైన పాత్ర పోషించి... ఆసియన్‌ అమెరికన్లను ఏకతాటిపై నడిపించాడు. అమిత్‌ జానీ... నేషనల్‌ ఆసియన్‌ అమెరికన్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్‌ విభాగానికి డైరెక్టర్‌‌గా సారథ్యం వహించారు.


అమెరికాలోని ఏషియన్‌ పసిఫిక్‌ సంతతి ఓటర్లు బైడెన్‌వైపు మొగ్గుచూపేలా గతంలో ఎవరూ చేయని రీతిలో వినూత్న ప్రచార విధానాన్ని రూపొందించారు అమిత్. ఇందులో 14 ఆసియా పసిఫిక్‌ జాతులను భాగస్వామ్యులను చేస్తూ కీలక రాష్ట్రాల్లో లీడర్‌షిప్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరు భారతీయ భాషలు సహా 20 ఆసియా పసిఫిక్ భాషలకు ప్రాతినిధ్యం కల్పించారు. పెయిడ్ మీడియా, డిజిటల్ ప్రకటనల కోసం ఒక్కో కౌన్సిల్‌లో ఏడుగురిని నియమించారు. మొత్తం 300 మంది సభ్యులతో వాలంటరీ ఆర్గనైజేషన్ రూపొందించారు.


సౌత్‌ ఆసియన్స్‌ ఫర్‌ బైడెన్‌ టీమ్ రూపకల్పనలో అమిత్ సహకారమందించారు. బైడెన్‌కు మద్దతునిచ్చే భారతీయ అమెరికన్లు, హిందువులు, సిక్కులు, జైనులు తదితర వర్గాలను దీని ద్వారా ఏకతాటిపైకి తీసుకొచ్చారు.


ఇక... భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 న అమెరికాలోని భారతీయ ప్రముఖల నేతృత్వంలో భారీ వర్చువల్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇది అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమంగా నిలవడం విశేషం.  


కాగా... ప్రైమరీ ఎన్నికల సమయంలో మాత్రమే బైడెన్‌ బృందంలో అమిత్‌ చేరడం విశేషం. అంటే... కొద్ది నెలల్లోనే జాతీయస్థాయిలో ప్రచార విధానానికి రూపకల్పన చేయడం విశేషం. ఆయన అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికకావడం సహా ఆసియన్‌ ఓటర్లలో 71 శాతం మంది డెమొక్రాట్లవైపు మొగ్గుచూపేలా చేశారు. ఇలా బైడెన్‌ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేలా ‘అమిత్’ విజయం సాధించారు.

Updated Date - 2020-12-03T23:14:23+05:30 IST