Abn logo
Oct 25 2021 @ 01:01AM

అ‘పూర్వ’ కలయిక

తగరకుంట జడ్పీ పాఠశాలలో సమావేశమైన పూర్వవిద్యార్థులు


కనగానపల్లి, అక్టోబరు24: మండలంలోని తగరకుంట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2000 -01 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులం దరూ ఆదివారం పాఠశాలలో కలిశారు. ఈ సందరర్భంగా ఒకరినొకరు పలకరించుకుని, అప్పటి జ్ఞాపకలను గుర్తు చేసుకుని  సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. ఈ సమావేశానికి అప్పటి తెలుగు ఉపాధ్యాయుడు దేవాదానం హాజరై తన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.