AP: ప్రేమజంటను కాపాడిన అనంత పోలీసులు

ABN , First Publish Date - 2021-12-29T16:50:40+05:30 IST

కిడ్నాపర్ల చెర నుంచి ప్రేమజంటను కాపాడారు అనంత పోలీసులు.

AP: ప్రేమజంటను కాపాడిన అనంత పోలీసులు

అనంతపురం: కిడ్నాపర్ల చెర నుంచి ప్రేమజంటను కాపాడారు అనంత పోలీసులు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల నవీన్ కుమార్, ఇర్ఫాన రెండు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టం లేని ఇర్ఫాన కుటుంబ సభ్యులు... ఓ దుకాణంలో బట్టలు కొనేందుకు వచ్చిన ప్రేమజంటను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న ఇర్ఫాన పోలీసులను ఆశ్రయించారు. ఇర్ఫాన ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రసన్నాయన పల్లి గేటు సమీపంలో కారును వెంబడించి పట్టుకున్నారు. ఆపై కిడ్నాపర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-12-29T16:50:40+05:30 IST