సముద్రం పాలయ్యే నీటిని లెక్కగట్టి వాటాలు వేస్తారా?: టి.లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2020-06-05T17:39:37+05:30 IST

సముద్రం పాలయ్యే నీటిని లెక్కగట్టి వాటాలు వేస్తారా?: టి.లక్ష్మీనారాయణ

సముద్రం పాలయ్యే నీటిని లెక్కగట్టి వాటాలు వేస్తారా?: టి.లక్ష్మీనారాయణ

అమరావతి: కృష్ణా మిగులు జలాలను కమిటీ నిర్ధారించే వరకు... 50:50 శాతం నిష్పత్తిలో సర్దుబాటు చేస్తామనడం సరికాదని ఎనలిస్ట్ టి.లక్ష్మీనారాయణ అన్నారు. సముద్రం పాలయ్యే నీటిని లెక్కగట్టి వాటాలు వేస్తారా అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీలో ఉండాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లు గడచినా హైదరాబాద్‌ కేంద్రంగానే పని చేస్తోందని...దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోందని నిలదీశారు. కృష్ణానది యాజమాన్య బోర్డును తక్షణమే కర్నూలుకు తరలించాలని...దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని  టి.లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-06-05T17:39:37+05:30 IST