Advertisement
Advertisement
Abn logo
Advertisement

రమ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలిచిందని కక్షగట్టారు: ఆనంద్‌బాబు

గుంటూరు : మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు హౌస్ అరెస్ట్ అయ్యారు. వసంతరాయపురంలోని ఇంట్లోనే ఆనంద్ బాబుని పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. లోకేష్ నరసరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. రమ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలిచిందని పోలీసులు కక్షగట్టారన్నారు. చంద్రబాబు, లోకేష్ అంటే ఈ ప్రభుత్వం, పోలీసులు భయపడి పోతున్నారన్నారని ఆనంద్ బాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్రలను, దీక్షలను ఎప్పుడు అడ్డుకోలేదన్నారు. తాము అడ్డుకుని ఉంటే మీ నాయకుడు పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదని ఆనంద్ బాబు పేర్కొన్నారు.


Advertisement
Advertisement