May 6 2021 @ 16:22PM

గుహన్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ!

ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసిన కేవీ గుహన్‌ ‘118’ చిత్రంతో దర్శకుడిగా మారారు. మరో ప్రయత్నంగా ఆనంద్‌ దేవరకొండ హీరోగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ‘హైవే’ (ఏ నర్వ్‌ వ్రాకింగ్‌ రైడ్‌ స్టోరి) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోడ్‌ జర్నీ నేపథ్యంలో సైకో కిల్లర్‌-క్రైమ్‌ థ్రిల్లర్‌గా  తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్‌ తలారి నిర్మాత. గురువారం ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి గాదరి కిశోర్‌కుమార్‌ క్లాప్‌ కొట్టగా, దర్శకుడు వీరభద్రం కెమెరా స్విచాన్‌ చేశారు. జూన్‌ మొదటివారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతారు. 

నిర్మాత మాట్లాడుతూ ‘‘గుహన్‌ చెప్పిన కథ థ్రిల్లింగ్‌గా ఉంది. ఆయన దర్శకత్వంలో హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిన నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు. ‘‘ప్రీ ప్రొడక్షన్‌ దాదాపు పూర్తయ్యింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సెలక్షన్‌ జరుగుతోంది’’ అని గుహన్‌ అన్నారు. ‘‘అనుభవం ఉన్న టెక్నీషియన్‌తో పనిచేయడం ఇదే మొదటిసారి. ఈ జర్నీలో చాలా నేర్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అని ఆనంద్‌ దేవరకొండ చెప్పారు. 

ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె. కింగ్‌, నిర్మాత: వెంకట్‌ తలారి, కథ, స్ర్కీన్‌ ప్లే, ఫొటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌