May 7 2021 @ 00:12AM

ఆనంద్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

ఆనంద్‌ దేవరకొండ హీరోగా ‘హైవే’ అనే చిత్రం గురువారం ప్రారంభమయింది. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి. గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘118’ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రమిది. శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్‌ తలారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోడ్‌ జర్నీ నేపథ్యంలో క్రైమ్‌ థిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని గుహన్‌ వెల్లడించారు. ఈ చిత్రానికి సైమన్‌ కె. కింగ్‌ సంగీత దర్శకుడు.