‘ఐరన్ మ్యాన్ సూట్‌’కు ఆకర్షితుడైన ఆనంద్ మహీంద్ర

ABN , First Publish Date - 2021-10-02T01:51:39+05:30 IST

ప్రేమ్ అనే బాలుడి గురించి నేను స్పందిస్తున్నాను. ఇంపాల్‌కు చెందిన ఈ బాలుడు వాడి పడేసిన వస్తువులతో ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేశాడు. ఇలాంటి టాలెంట్‌ను నేను ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఆటో సెక్టార్‌లో పార్టర్న్‌లుగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. అలాగే ఇంపాల్‌లోని శివ్జ్ ఆటోటెక్‌ బృందాన్ని ప్రేమ్ మద్దకు పంపించాను..

‘ఐరన్ మ్యాన్ సూట్‌’కు ఆకర్షితుడైన ఆనంద్ మహీంద్ర

గువహాటి: మణిపూర్‌కి చెందిన ఓ బాలుడు వాడి పడేసిన వస్తువులతో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఆ బాలుడు తయారు చేసిన ఐరన్ మ్యాన్ సూట్‌కు మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర ఫిదా అయిపోయారు. ఇంకేంటి వెంటనే బాలుడి వివరాలు కనుక్కొని తన బృందాన్ని అక్కడికి పంపించారు. బాలుడి ఆలోచనలు తెలసుకోవడంతో పాటు అతడికి కావాల్సిన సహయాన్ని అందివ్వడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజెన్లతో షేర్ చేసుకున్నారు.




‘‘ప్రేమ్ అనే బాలుడి గురించి నేను స్పందిస్తున్నాను. ఇంపాల్‌కు చెందిన ఈ బాలుడు వాడి పడేసిన వస్తువులతో ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేశాడు. ఇలాంటి టాలెంట్‌ను నేను ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఆటో సెక్టార్‌లో పార్టర్న్‌లుగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. అలాగే ఇంపాల్‌లోని శివ్జ్ ఆటోటెక్‌ బృందాన్ని ప్రేమ్ మద్దకు పంపించాను. ప్రేమ్ ఆశలను అడిగి తెలుసుకున్నారు. ప్రేమ్ ఆశయం, నైపుణ్యాలను తెలుసుకుని నేను చాలా స్ఫూర్తి పొందాను. కానీ అతడి పరిస్థితి తెలిసి కొంత ఆవేదన కలిగింది. వెనుక బడిన ప్రాంతాలు, సమూహాల నుంచి వచ్చే వ్యక్తులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. కానీ ప్రేమ్ తనకు దొరికిన వాడి పడేసిన వస్తువులతోనే తన ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాడు. మా గ్రూప్ చీఫ్ డిజైన్ ఆఫీసర్, ప్రతాప్‌ సైతం ప్రేరణ పొందారు. ఆయనే ప్రేమ్‌కు కెరీర్‌కు మార్గనిర్దేశం చేస్తారు. మహీంద్రా ఫౌండేషన్ అధిపతి శీతల్ మెహతా. ప్రేమ్‌తో పాటు అతని తోబుట్టువుల విద్యకు సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తారు’’ అని వరుస ట్వీట్లు చేశారు ఆనంద్ మహీంద్ర.

Updated Date - 2021-10-02T01:51:39+05:30 IST