Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో ముగిసిన విచారణ

అమరావతి: కరోనాకు ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో విచారణ ముగిసింది. మందు హానికరంకాదని, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినవారిని అక్కడికి తీసుకొస్తే.. ప్రమాదమని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. తాము దీనిని నిర్వహించలేమని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. తమ వాదనలను రికార్డ్ చేయాలని హైకోర్టు ధర్మసనానికి విజ్ఞప్తి చేశారు. మందువల్ల హానిలేదని చెప్తూ వేయటానికి అభ్యంతరం ఏమిటని న్యాయస్థానం  ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వనీకుమార్, పిల్ వేసిన న్యాయవాది యలమంజుల బాలాజీ వ్యతిరేకించారు. మందుకు అనుమతిస్తూనే ప్రభుత్వం ఇలా వ్యవహరించటం.. మంచిదికాదని న్యాయవాదులు చెప్పారు. ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే మందు వేసేందుకు.. అభ్యంతరం ఏమిటని న్యాయవాదులు ప్రశ్నించారు. ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతోనే కంటిలో మందు కోసం.. అక్కడికి వస్తారని న్యాయవాదులు  ధర్మాసనానికి చెప్పారు. కోర్టు ముగిసిన తర్వాత ఆర్డర్ ఇస్తామని ధర్మాసనం చెప్పింది.

Advertisement
Advertisement